ప్రతి మాటలో నిన్నే పోల్చానే
ప్రతి ఒక్కరిలో నిన్నే చూసానే
సృష్టిలో ప్రతీ స్పందన నీదైనట్టు
నా ప్రతిస్పందనలో భావసృష్టి నీకైనట్టు
కలలు తీరని కాలంలో,
కంటతడి ఆరని తీరంలో
నరకానికి నిచ్చెనలేస్తూ..
నవ్వుల మాటున నిజాల్ని దాస్తూ
ఎవ్వరికీ చెప్పుకోలేక..
ఎడబాటుని భరించలేక..
తరలి వెళ్తున్నా నేస్తం..
తిరిగిరాని లోకాలకు..
నీ చెంత చేరే మార్గాలకు..
****************************
written by BODDU MAHENDER
at 11:18am 15.3.2013
No comments:
Post a Comment