అక్షరాన్ని దిద్దిస్తావు..
అంగరక్షణ గావిస్తావు..
అజ్ఞానాన్ని అంతమొందించి..
అన్యాయాన్ని తుదముట్టించి..
ఆత్మ విశ్వాసం పెంచేస్తావు..
ఆర్ధ్రంగా మదిని పిండేస్తావు..
ఓ కలమా..
కళల మాయాజాలమా..
కవికి బాసట నీవే..
కన్నీటికి ఊరట నీవే..
పాత్రికేయుడి ఆయుధమవుతావు
ప్రజా బంధుకు గొంతుకవుతావు
మనసుని విప్పే యంత్రమవుతావు
చదువుని చెప్పే తంత్రమవుతావు
ఓ కలమా...అధికార దర్పం నీదే..
అంతరంగాన్ని తాకే మార్గం నీదే..
*********************************
written by BODDU MAHENDER
at 10:16pm 13.3.2013
No comments:
Post a Comment