నిర్లిప్తత మబ్బులో నిస్తేజమైన నాయకులు
నిజమైన పోరాటానికి సృష్టిస్తున్న అడ్డంకులు
స్వలాభ కాంక్షే తప్ప స్వతంత్రత పట్టని మూర్ఖులు
స్వరాజ్య సాధనలో సడేమియాగా మారిన ధూర్తులు
ఇట్లా అయితే ఎప్పుడొస్తది నా తెలంగాణ?
సిరులు, ఝరులు గల్ల నా తెలంగాణ..!!
ఆశయం కోసం అమరులైన వారి కోర్కె తీరేనా..?
అవసరం కోసం అమ్మనైనా తాకట్టు పెట్టే తీరు మారేనా..?
సబ్బండ వర్ణాల సమిష్టి పోరుకి ఫలితం దక్కేనా..?
సమిష్టియై సమైక్య వాదుల కుట్రని తిప్పి కొట్టేనా..?
ఇంకెప్పుడొస్తది మరి నా తెలంగాణ?
గనులు, ఘనులు గల్ల నా తెలంగాణ..!!
********************************
written by BODDU MAHENDER
at 9:17am 7.3.2013

No comments:
Post a Comment