ఆలోచనలని ఆవిష్కరించే
అక్షరాలు ఉన్నాయేమో గాని,
అనుభూతులని వ్యక్తీకరించే
సాధనాలే లేవు..ఉన్నా సంపూర్తి కాదు..
మనసెపుడూ మనకో పజిల్..
మాటలెపుడూ కావులే, దానికి సింబల్..
భాష లేదు ఆ సంతోషానికి..
భావం సరిపోదు దాని విషాదానికి..
కన్నులు పలికినా,
దాన్ని కాంచే తత్వముండాలి గా..
మౌనంలోనూ మనల్ని అర్ధం చేసుకునే
ఓ ప్రియ నేస్తం ఉండాలి కదా..
అందుకే ఎన్ని రాసినా నాకు సంతృప్తి లేదు..
ఏం చేసినా నాకు ఆ స్నేహ హస్తం రాదు..
**************************
written by BODDU MAHENDER
at 11:32pm 19.12.2012
No comments:
Post a Comment