Sunday, 21 October 2012

నువ్వు వద్దన్నా..

వలచి వస్తే వద్దంటున్నావు..
వలపుల తేనే చేదంటున్నావు..
కన్నీటి కొలనులో నువ్వు సేద తీరుతూ..
కడగండ్ల ఎడారిలో నన్ను కాలిపో అంటున్నావు..
నీ భయమేమిటో,బాధెందుకో  నాకు తెలీదు..
కాని నా ఆశ ,శ్వాస అన్నీ నీవే అని తెలుసుకో..
నీ జతలో నిలిచే అదృష్టం నాది కాదేమో,
కానీ, నిను జన్మంతాఆరాధించే మనసు నాది..
అందుకే, నువ్వు వద్దన్నా..
నిను ప్రేమిస్తూనే ఉంటా..
నీ ఆశల సౌధాన్ని నేను నిర్మిస్తూనే ఉంటా..
*****************************
written by BODDU MAHENDER
at 12:45pm 21.5.2012

No comments:

Post a Comment