Saturday, 15 December 2012

అర్ధం చేసుకోని మనసుకి,


అవగాహన లేని మనిషికి,
అనంతమైన నిధి నిక్షేపాలిచ్చినా వ్యర్ధమే..
అర్ధం చేసుకోని మనసుకి,
ఆత్మీయతానురాగాలు పంచినా వ్యర్ధమే..
సద్వినియోగం ఆ మూర్ఖుడికి రాదు..
సమ భాగస్వామ్యం ఈ మూఢుడికి తెలీదు..
అందుకే, 
అర్హతలేని వాళ్లని అందలమెక్కించవద్దనేది.
ఆశలు పెంచి అంతర్ధానమయ్యే వాళ్లకి,
అంతరంగాన చోటివ్వవద్దనేది.
ఊరించే మాటలకి ఉప్పొంగిపోవద్దనేది,
ఉలుకులేని ప్రాయానికి కులుకులు నేర్పి,  
ఇలా విరహంతో కుమిలిపోవద్దనేది.. 

*******************************
written by BODDU MAHENDER
at 11:21am 16.12.2012

No comments:

Post a Comment