Saturday, 15 December 2012

ఈ పయనానికి అంతమెప్పుడో..

ఎవరో చెప్పారు..
నిజమైన ప్రేమ దొరికితే 
నీ అంత అదృష్టవంతుడు ఎవరూ ఉండరని..
నాకూ అనిపించింది..
నాలా ప్రేమించే మరో మనసుంటే ఎంత బాగుండని...
అందుకే వెతకడం మొదలెట్టా..
ప్రేమకోసం  అన్ని కళల్లోనూ అడుగెట్టా..
నన్ను ఆరాధించే ప్రతి కళ్ళలోనూ పసిగట్టా..
కానీ,అది అభిమానమే తప్పా..నాపై ఆరాధన కాదు..
ఆత్మీయ భావనే తప్ప అంతరంగ  సాంత్వన కాదు..
నా కళలన్నీ నాకు జీవించే కళ నేర్పాయి గానీ,
నన్ను ప్రేమించే కల మాత్రం తీర్చలేదు..
నా సరిజోడు కోసం ఇంకా వెదుకుతూనే ఉన్నా..
నా ఈడు భావనలతో ఒంటరిగా రగులుతూనే ఉన్నా..
ఈ పయనానికి అంతమెప్పుడో..
నా ప్రణయానికి ఆరంభమెప్పుడో...
*******************************
written by BODDU MAHENDER
at 11:21pm 15.12.2012

No comments:

Post a Comment