ఎందుకు నాకీ ఒంటరితనం..
నాలో నేనే అయి వుండే ఏకాకితనం..
ఏం..నాకు లేవా అన్ని ఆశలు,కోరికలు..
కొంటె మనసు ఊసులు,ఊహలు..
నేనేమి రాయీ రప్పను కాదే..?
నా మనసుకీ స్పందన ఉంది..
దానికీ ప్రేమించే గుణముంది..
ఆరాధించే తత్వముంది..
అక్కున చేర్చుకునే వాళ్ళని
ఆజన్మాంతం నెత్తిన పెట్టుకొని మరీ,
అభిమానించడం తెలుసు..
అయినా ఎందుకు మీకందరికీ, నేనంటే అంత అలుసు..
కాస్తయినా ప్రేమించలేరా..నాతోడై మీరు జేవించలేరా..??
****************************
written by BODDU MAHENDER
at 10:16pm 15.12.2012

No comments:
Post a Comment