నీవనుకొని నీడను ముద్దాడుతున్నా..
నీ రూపనుకొని ప్రేమను వెంటాడుతున్నా..
ఆశలతోనే అనుక్షణం వేసారిపోతున్నా..
ఆవేదనలోనే నే నిండా కరిగిపోతున్నా..
నా నమ్మకం ... నువ్వొస్తావని,
నా చితి రగిలే చోట
ఓ కన్నీటిచుక్కనయినా జారవిడుస్తావని..
ప్రేమా.. నిను పొందే అదృష్టం,
ఈ జన్మకి నాకు లేదని..
ఈ క్షణమే నే మరణిస్తున్నా ..,
నీ సానుభూతి అయినా నాకు మిగులుతుందని.
****************************
written by BODDU MAHENDER
at 7:40pm 25.3.2013
No comments:
Post a Comment