Wednesday, 26 September 2012

మరుభూమిలో సేద తీరుతావనుకోలేదు....


దూర దేశాలకి వెళ్ళావనుకున్నా గానీ,
దూరమై పోతావనుకోలేదు..
కలలన్నీ మోసుకెళ్ళావనుకున్నా గానీ,
కన్నీటి చుక్కల్ని రాలుస్తావనుకోలేదు..
కూడబెట్టి పంపిస్తావనుకున్నా గానీ,
కూటికే లేక కృశించి పోతావనుకోలేదు..
మాతృభూమికి పేరు తెస్తావనుకున్నా గానీ,
మరుభూమిలో సేద తీరుతావనుకోలేదు..
వేకువ రేఖయి ఉంటావనుకున్నా గానీ,
వేగు చుక్కయి నిలుస్తావనుకోలేదు..
మా అందరినీ ఇలా అశ్రుధారలో
అభ్యంగ స్నానాల్ని  చేయిస్తావనుకోలేదు..
**************************
written by BODDU MAHENDER
at 7:22pm 26.9.2012

No comments:

Post a Comment