Tuesday 8 October 2013

వలపు ఆశ మొలుస్తూనే ఉంది

మనసెందుకో తపిస్తోంది
మరి మరి ఎందుకో జపిస్తోంది
మౌనమెందుకో నిలిపేస్తోంది
మది గది నెందుకో మూసేస్తోంది 

కాలం - నన్ను కాలరాసేస్తోంది 
కలలో సైతం తనను  దాచేస్తోంది
ప్రేమ - ఈ గుండెను పిండేస్తోంది
ప్రేయసి  విరహాన నను ముంచేస్తోంది

అయినా 
వలపు ఆశ మొలుస్తూనే ఉంది
వాత్సల్య  పూలు పూయిస్తూనే ఉంది 
****************************
written by BODDU MAHENDER
at 6:20pm , 8.10.2013

No comments:

Post a Comment