హరిదాసు రాగానికి పల్లె తాళమేయంగా
సన్నాయి మేళానికి నంది నాట్యమాడంగా
పంట సిరులు చేరి ఇళ్ళు నిండంగా..
పడుచులందరు గూడి ముగ్గులేయంగా..
గొబ్బెమ్మల పాటలు గొంతు చేరంగా..
సంక్రాంతి లక్ష్మికి స్వాగతమివ్వంగా..
తుపాకి రాముళ్ళ కోతలు ఉరకలెత్తంగా..
పందెపు రాయుళ్ళ కోళ్ళు పరుగులెత్తంగా..
గాలిపటాలని ఎగరేసి ఆ గగనాలు చేరంగా..
పిండివంటలు చేసి ఇల సంబరాలు చేయంగా..
వచ్చింది వచ్చింది ఈ సంక్రాంతి పండుగ..
ఊరు వాడా నింపింది సంతోషాన్ని మెండుగా..
*******************************
written by BODDU MAHENDER
at 6:57pm 14.1.2012
శ్రేయోభిలాషులందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు

No comments:
Post a Comment