Saturday, 24 November 2012

కొన్ని అపజయాలొచ్చినంత మాత్రాన......

అడగకముందే అందరికీ దొరుకుతోంది..
నేనడిగినా...అడుక్కున్నా కూడా ..
ఏదీ అందకుండా పోతోంది...
కష్టపడకుండా ఏదీ రాదని తెలుసు..
కానీ నా కణకణం కాలి బూడిదవుతున్నా ..
కన్నీరే మిగిలి..
అవుతున్నా మీ అందరికీ అలుసు..

నేస్తాల్లారా...!!!
తప్పు నాది కాదని మీలో తెలిసేది ఎందరికని..??
తప్పులెంచి తలతిప్పుకు పోతారెందుకని ...??
అపశకునాలని నాకు అంటగట్టి అంటరానివాడినంటారా..??
అదృష్టహీనుడని నను హేళన చేసి అవమానపరుస్తారా..??
స్నేహం చేయడం, నమ్మకంగా మెలగడమే నా తప్పా..?
నావాళ్ళు గా మిమ్మల్ని భావించడమే నే కొనితెచ్చుకున్న ముప్పా..??

కొన్ని అపజయాలొచ్చినంత మాత్రాన మనిషి వ్యర్ధమవుతాడా..?
కొన్ని విజయాలతోనే ఈ జగాన్నంత యేలేస్తాడా...?
ఎందుకు మీ మూర్ఖత్వాన్ని ప్రదర్శించి చరిత్ర హీనులవుతారు..??
ఎందుకు మీ అమాయకత్వంతో అందరికీ లోకువ అవుతారు..??
ఈరోజు కాకపోయినా రేపైనా నా ప్రతిభ వెలుగులోకి రాదా..??
పశ్చాత్తాపంతో మీరంతా తలదించుకునే రోజు రాదా..??
***********************************
written by BODDU MAHENDER
at 4:45pm 24.11.2012

No comments:

Post a Comment