Thursday, 19 July 2012

నారీ లోకాన్ని నడిపిస్తానంటూ


చినుకు తడి ఆరింది
వెలుగు రేఖ సోకింది
సప్త వర్ణాల హరివిల్లు 
సంభ్రమంగా విచ్చింది

కంటి తడి తుడుస్తానని
గుండె సడి వింటానని 
కొడిగట్టిన జావితాలకి
కొత్త ఆశని అవుతానని
నమ్మకంగా పలికింది 
నవ్య పథాన నడిచింది

అనాధలకి ఆసరానిస్తూ
అభాగ్యులకి ఆదరువు చూపుతూ
నలుగురికీ ఆదర్శమయ్యేలా 
నారీ లోకాన్ని నడిపిస్తానంటూ 
సమాజ హితాన్ని కోరింది 
సంస్కరణల మార్గాన్ని చూపింది
*********************
written by ME
at 6:30pm 19.7.2012
ఈరోజు హైదరాబాద్ లో రోటరీ ఇంటర్ నేషనల్ వారి ఆధ్వర్యం లో భాగ్య నగరంలో తొలిసారిగా మహిళల కోసం ప్రత్యేకంగా రెయింబో క్లబ్ ప్రారంభం అవుతున్న సందర్భంగా వారికి నా శుభాకాంక్షలు..

No comments:

Post a Comment