మధనా...ఓ..మధనా..
వినవా నా వేదన
ప్రేమ కోసమే నా శోధన..
ప్రేయసి కోసమే నా ప్రతి సాధన..
తను లేదనే నా రోదన..
తన ఊహల్లోనే నా ప్రేమారాధన
నువ్వైనా చూపిస్తావనే ఈ నివేదన
కాంక్షలన్నీ తీరుస్తావనే నా సంవేదన
కనిపిస్తే చేయనా పెళ్లి ప్రతిపాదన..
కన్నె పిల్ల అయితే ఇందు వదన..
మరి
మధనా...ఓ..మధనా..
విన్నావా నా వేదన..!!
********************
written by ME
at 9:05pm 18.7.2012
No comments:
Post a Comment