అర్చిస్తూనే ఉన్నా..
అర్ధిస్తూనే ఉన్నా..
ఆశ ఒకటైనా తీర్చమని..
ఆవేదనగా ఆలపిస్తూనే ఉన్నా..
తలుస్తూనే ఉన్నా..
తన్మయం చెందుతూనే ఉన్నా..
తరగని సిరుల గనినొకదాన్ని
తర్పణ చేయమని తలపోస్తూనే ఉన్నా..
పఠిస్తూనే ఉన్నా...
పారాయణ గావిస్తూనే ఉన్నా...
పరుగులు పెట్టే పరువానికి..
పడతి ప్రణయం జత చేయమని
ప్రాధేయ పడుతూనే ఉన్నా..
కవిలా రాస్తూనే ఉన్నా..
కానుకలు వేస్తూనే ఉన్నా..
కవన భువన సామ్రాజ్యానికి
కలకాలం నన్నే రాజుగా చేయమని..
కాకా పడుతూనే ఉన్నా..
*********************
written by BODDU MAHENDER
at 2:50pm 11.7.2012
No comments:
Post a Comment