Wednesday, 23 May 2012

అదే మన ఏపిపిఎస్సీ(APPSC ) ..


వరుస ప్రకటనలు..వందల్లోనే  ఉద్యోగాలు...
వానచినుకుల్లా అభ్యర్థులు..వాయిదాల్లోనే పరీక్షలు..
వివాదాలు షరా మామూలే.. విస్తుపోవడం సదా రివాజేలే..
అదే మన ఏపిపిఎస్సీ(APPSC ) ..
ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్....

ఆశయాల అభ్యర్థికి, 
ఇక్కడ అడుగడుగునా వేధింపులు..
అనువాదాల దోషంతో, అమ్మభాషకే తలవంపులు..

అనుకున్న గమ్యం కోసం పడే, ఆహోరాత్రపు కస్టాలు..
అనుమానాల మధ్య గడిచే కాలంతోనే, మిగిల్చే నష్టాలు..

ప్రశ్నలుండక పోవచ్చు..పరీక్ష పత్రమే లేకపోవచ్చు..
లొసుగులు ఉండొచ్చు..లోపాయికారీ ఒప్పందాలూ జరగొచ్చు..

పరీక్ష ముగిసి ఫలితమొచ్చే దాకా.. ఒక ఆందోళన 
ఫలితాలు చూసి పక్షపాతాలుంటే ..మరో ఆందోళన..

నిజంగానే అభ్యర్థికి ఇదో విషమ పరీక్ష..
పారదర్శకత లేని మన ప్రభుత్వ నియామక పరీక్ష..
ఉత్సాహం ఎంతున్నా..ఊడ్చిపారేస్తుంది..
ఊరడించే తీర్పులొచ్చినా... ఉసురు తీస్తుంది..

దీని తీరు మారేదెప్పుడో...మరి..
 నిట్టూర్పులతోనే మన జీవితం..సరి..
************************
written by ME
at 10:10pm 23.5.2012


No comments:

Post a Comment