Monday, 9 April 2012

సడలని ప్రేమకి సంకేతం..

ఎదురు చూసీ చూసి చుక్కల్లో కలిసిపోయింది తన  ప్రాణం
కాలం గడిచీ గడిచి శిలయిపోయింది ఆ దేహం..

చెలియకై వగచీ వలచి వెతుక్కుంటూ వచ్చే ప్రియుడు..
చెలి కాన రాక తన రూపు చెక్కే ..ఆ  ..మరుడు..

శిల అయిన దేహమే శిల్పమయ్యే, అతని కళతో ..,
శిల్పం కాదు చెలి రూపం అని తలచే, తన మనసుతో,,

పొంగుకొచ్చే  కన్నీటిని ..కార్చెను.. చెలి పాదంపై,
ముంచుకొచ్చే మృత్యువుతో ..ఒరిగెను తన హృదయం పై ..

సడలని ప్రేమకి సంకేతమై నిలిచే ..ఆ మగువ 
వీడని బంధానికి  ప్రతీకగా మిగిలే ..అతడి మక్కువ..
*******************************
written by BODDU MAHENDER
at 2:11am 9.4.2012  

No comments:

Post a Comment