మాట పలకని ఈ మౌనం
మనసుని చిత్రవధ చేస్తున్నా,
మాట నిలుపుకోని నా గతం,
ఆ మాట్లాడే ఆశకి కళ్ళెం వేస్తోంది..
నాపై నాకు ఎంత నమ్మకమున్నా,
నన్ను నడిపించే ఈ విధి చేతిలో,
నేనెప్పుడూ బలి అవుతూనే ఉన్నా..
నీపై నాకు ఎంత ప్రేమున్నా,
ఓ మాటైనా చెప్పుకోలేని నా స్థితికి,
నిత్యం కుమిలిపోతూనే ఉన్నా..
నువ్వు కావాలి అని,
ఏడేడు లోకాల్లో వినవచ్చేలా అరిచినా,
ఇసుమంతైనా,
నీ చెవిన పడిందో,లేదో..నా ఆవేదన..
తరగని ప్రేమ తనువంతా ఉన్నా,
మనసైన మగువ చెంతనే ఉన్నా,
ప్రేమ పంచలేని అశక్తత,
మనసులోనే దాచి ఉంచలేని నిర్లిప్తత..
మనసు గోడు వినే, ఏ దైవమైన ఉంటే,
నా విరహ వ్యధని తెలుపరే, నా చెలికి....
మరణం అంచుదాకా నడిచే,
తన సరిజోడు నేనే అని....
*********************
written by ME
at 1:29am 9.4.2012
మనసుని చిత్రవధ చేస్తున్నా,
మాట నిలుపుకోని నా గతం,
ఆ మాట్లాడే ఆశకి కళ్ళెం వేస్తోంది..
నాపై నాకు ఎంత నమ్మకమున్నా,
నన్ను నడిపించే ఈ విధి చేతిలో,
నేనెప్పుడూ బలి అవుతూనే ఉన్నా..
నీపై నాకు ఎంత ప్రేమున్నా,
ఓ మాటైనా చెప్పుకోలేని నా స్థితికి,
నిత్యం కుమిలిపోతూనే ఉన్నా..
నువ్వు కావాలి అని,
ఏడేడు లోకాల్లో వినవచ్చేలా అరిచినా,
ఇసుమంతైనా,
నీ చెవిన పడిందో,లేదో..నా ఆవేదన..
తరగని ప్రేమ తనువంతా ఉన్నా,
మనసైన మగువ చెంతనే ఉన్నా,
ప్రేమ పంచలేని అశక్తత,
మనసులోనే దాచి ఉంచలేని నిర్లిప్తత..
మనసు గోడు వినే, ఏ దైవమైన ఉంటే,
నా విరహ వ్యధని తెలుపరే, నా చెలికి....
మరణం అంచుదాకా నడిచే,
తన సరిజోడు నేనే అని....
*********************
written by ME
at 1:29am 9.4.2012
No comments:
Post a Comment