ప్రేమించి జీవితాన్ని అర్పించా
అయినా నీ మొహం తీరక
కోరిక నెరవేరక .. వేధిస్తుంటే,
నాలో నేనే అనుక్షణం
నరకం అనుభవించాను గాని,
అరక్షణమైనా నిన్ను వదలలేక పోయా..
కాని నన్ను వంచించి ,వేరొకరిని వాంఛించి
నీ ఈ దాసిని పరిత్యజించాలనే
నీ ఆలోచనతో ఇక నిలవలేకపోయా..
నిన్ను ముద్దాడిన ఈ పెదవులని,
నీవే లోకమనుకున్న ఈ కనులని,
నిన్ను అణువణువునా నింపిన ఈ రక్తాన్ని,
నీవే ప్రేమైక దైవమని భావించిన నా హృదయాన్ని,
చిదిమేసి, గాయపరిచి..
కడసారి చెబుతున్నా ఈ వీడుకోలు.
ఇప్పుడు నాలో ఏ అహం లేదు..
ఈ దేహం పై వ్యామోహం లేదు..
నా ఆకారం చెదిరినా
నీ పై మమకారం తగ్గకుంది..
ఈ ప్రాణం వదిలినా,
నాలో జీవం నీవేనంది..
***
ప్రేమించే మనసుని కోరు..
కామించే దేహాన్ని కాదు..
వాంఛించే హృదయాన్ని కోరు..
వంచించే ఆశని కాదు.
******************
written by ME
at 2:40pm 12.4.2012
.jpg)
No comments:
Post a Comment