అప్పుడప్పుడు నాకు నేను గుర్తొస్తాను
దీర్ఘ ధ్యానం లో నా ఉనికిని నేను గుర్తిస్తాను
మనిషిగా నేను సాధించినవన్నీ వదిలేసి,
నా మనసు చెప్పే కబుర్ల కోసం వెంపర్లాడుతాను
మానసిక అలసట నుండి సేదతీరుతాను..
ముఖస్తుతులకి మొహం మొత్తి
నా అంతరాత్మ చేసే విమర్శలకు తలొగ్గుతాను
అంతరంగం చేసే అల్లర్లకి విసుగెత్తి,
నా ప్రేయసి చూపే అనురాగానికి తలెత్తుతాను
నాకు నేనే జవాబుదారినై
చిక్కు ప్రశ్నల వేట సాగిస్తాను..
నాకు నేనే రాజునై
ప్రేమ రాజ్యాన్ని సృష్టిస్తాను..
అప్పుడప్పుడు నాకు నేను గుర్తొస్తాను
దీర్ఘ ధ్యానం లో నా ఉనికిని నేను గుర్తిస్తాను
ప్రకృతి తో మమేకమై ఆటలాడుతాను..
ప్రాణ ప్రదమైన ప్రేయసితో ఆనందపడుతాను
*******************************
written by ME
at 6:41am 21.4.2012
No comments:
Post a Comment