Saturday, 21 April 2012

నీ ప్రేమకే అర్పిస్తున్నా...

ఒకనాడు ఇవే పట్టాలపై మనం
ఒకరికొకరం నువ్వు-నేను అని
బాస చేసుకున్నాం, బాధ్యతలు పంచుకున్నాం
ప్రేమించుకున్నాం, పెళ్లాడాలనుకున్నాం
మధుర క్షణాలు ఇక మనవే అని 
మనసుని ఊహల పల్లకి ఎక్కించాం 
మమతల దీవిలో ఊరేగుతూ ఆనందించాం..

పెళ్లి ఘడియలు రాగానే..ఆ విధి ఎప్పటిలానే
ఎర్ర లైటు పట్టుకొని ఎదురుగా నిలిచింది..
ముడిపడే వేళ మోట కత్తితో ముందుకే వచ్చింది..

కారణాలు ఏవైనా , కారకులు ఎవరైనా
బలహీనమైన ఆ క్షణాల్లో ,బలీయమైన ఆ వేటుకి
పగిలిన నా హృదయం తిరిగి అతుక్కోలేకుంది..
కంట నీరు ఆగి రక్తమే ఒలికింది..

నన్ను విడిచి వేరొకరితో ,నీ జీవితం సాగిపోయింది..
నిన్నే తలుస్తూ నా జీవితం గతంలోకి వెళ్లిపోయింది..
నీ ఊహలలోనే బ్రతుకుతూ..
రాని నవ్వులని పెదాలపై అతికిస్తున్నా..
చెరగని నీ స్మృతుల్లో తల్లడిల్లుతూ 
నా ఈ జీవచ్చవాన్ని  నీ ప్రేమకే అర్పిస్తున్నా...
*******************************
written by ME
at 4:20am 21.4.2012

No comments:

Post a Comment