Thursday, 26 April 2012

దురదృష్టానికి నిర్వచనం..

విషయం పాతదే..విధానమే కొత్తది..
అలవాటయినా.. ఆవేదన తీరనిది..

కార్చే కన్నీటికి అంతే లేదు..
కుదేలైన ఆశలకి లెక్కే లేదు..

జ్ఞాపకాలు గునపాలు అవుతున్నాయి..
గతాన్ని తోడి, గుండెని చిదిమేస్తున్నాయి..

దురదృష్టానికి నిర్వచనం నేనే..
దౌర్భాగ్యానికి రూపం నేనే.

చెప్పుకోవడానికి  ఎన్నో..
ఘనతలు..ఘన ప్రతిభలు 
చెప్పుకోక దాచినవీ ఎన్నో..
చరితలు..దీన గాథలు..

గాయాల్ని మాన్పాల్సిన కాలమే,
కొత్త గాయాల్ని రేపుతుంటే..,
ముక్కలైన ఈ  హృదయం 
నా ముగింపు కోసమే ఎదురు చూస్తోంది..
***********************
written by ME
at 7:59am 27.4.2012


No comments:

Post a Comment