Sunday, 4 March 2012

భారతీయ రైల్వేలు...

భారతీయ రైల్వేలు...
నా ప్రయాణంలో ఒక భాగం..
నా ఆలోచనలకి ఊతం..
ప్రకృతి సోయగాలని,
పల్లె సరాగాలని,
పేదల ప్రేమల్ని,
పెద్దల బంధాలని,
యువత ముచ్చట్లని,
నవత అల్లర్లని...
అల్లిబిల్లిగా.. అల్లి,నను గిల్లి..
అలుపులేని ప్రయాణాల్లో,
బడలిక లేని జీవితాల్లో..
అందమైన రంగులద్ది,
ఆనందానుభూతులు దిద్ది ,
ఆత్మీయమయ్యాయి..
నా జీవితంలో ఓ భాగమయ్యాయి..
*******************
written by ME
at 8:52am 3.3.2012 
on the way to Hyderabad in Bhagyanagar train..

No comments:

Post a Comment