Friday, 2 March 2012

నేనొక ప్రేమ పిపాసిని .. ఇంద్ర ధనుస్సు (1978)

పల్లవి :

నేనొక ప్రేమ పిపాసిని ..
నీవొక ఆశ్రమ వాసివి ..
నా దాహం తీరనిది..
నీ హృదయం కదలనిది..          "నేనొక "

చరణం :
తలుపులు మూసినా తల వాకిటనే
పగలూ రేయి నిలుచున్నా ..
పిలిచి పిలిచి బదులే రాక
అలసి తిరిగి వెళుతున్న..     "తలుపులు "
నా దాహం తీరనది ..
నీ హృదయం కరగనిది..
నేనొక ప్రేమ పిపాసిని ..

చరణం :

పూట పూట నీ పూజ కోసమని
పూవులు తెచ్చాను..
ప్రేమ భిక్షను పెట్టగలవని
దోసిలి ఒగ్గాను ..
నీ అడుగులకు మడుగులొత్తగా
ఎడదను పరిచాను..
నీవు రాకనే అడుగు పడకనే
నలిగి పోయాను ..
నేనొక ప్రేమ పిపాసిని ..

చరణం :
పగటికి రేయి రేయికి పగలూ పలికే వీడ్కోలు ..
సెగ రేగిన గుండెకు చెబుతున్న
నే చెవిన పడితే చాలు
నీ జ్ఞాపకాల నీడలలో
నన్నేపుడో చూస్తావు ..
నను వలచావని తెలిపే లోగా
నివురై పోతాను..
నేనొక ప్రేమ పిపాసిని ..

చిత్రం : ఇంద్ర ధనుస్సు (1978)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఎస్.పి. బాలు

No comments:

Post a Comment