Tuesday 13 December 2011

ఈ లోకానికి తెలియనిది ..


కలవని రైలు పట్టాలు
గణితంలో సమాంతర రేఖలు
నిజమైన ప్రేమికులు..
బద్ధ శత్రువులు ..
ఎప్పుడూ  కలవరు
కలిసి ఒకటిగా బ్రతకరు ..
అని అనుకుంటారు అంతా ..
కాని ఈ లోకానికి తెలియనిది ..
నీకూ నాకు మాత్రమే తెలిసినది ..

ఒకటుంది ..
పట్టాలు వేరుగానే ఉండొచ్చు ..
కాని లింకులతో అవెప్పుడూ ..
కలిసే ఉంటాయి..
రేఖలు కలవకపోవచ్చు ..
కాని అవి
నువ్వు నేనూ సమానమే అని చెప్తాయి .
నిజమైన ప్రేమికులు ...
భౌతికంగా  ఒకటైనా కాకపోయినా 
వారి మనసులు ఎప్పుడూ కలిసే ఉంటాయి ..
ఒకరి కోసం ఒకరు పరి తపిస్తూనే ఉంటారు .
బద్ధ శత్రువులు కలహించుకున్నా 
ఒకరిని ఒకరు ఎప్పుడూ మరిచిపోరు ..
*****************************
written by ME,
at 4:o8pm 13.12.2011




No comments:

Post a Comment