Sunday 11 December 2011

నిరాశల నిశీధి లో ...

కోరుకున్న వనితకి నేను వద్దు
కోరుతున్న ఓ మనసు నాకు వద్దు
కల లాంటి జీవితం ఇది
కథ లాంటి అనుభవం ఇది ..


కాలం తో ఎంత పరుగెత్తినా
కస్టాలు ,కన్నీళ్లు నీడలై
వస్తున్నాయి ఎందుకో ..?
ప్రేమ కోరిన పాపానికి ,
నా మనసుని ,
కార్చిచ్చుకి అంకితం ఇస్తున్నాయి ఎందుకో ..?
అయినా నీడలు ఎందుకు వదులుతాయి ..
నా పేరాశ గాని ..!!
ఎవరున్నా ..లేకున్నా ..
ఈ కాయం ఉన్నంత వరకు ..
కలిసి వచ్చే నిజ బంధాలు అవే కదా ..
ఎంత ప్రయత్నించినా వీడదని తెలుసు ..
అలాగే ,చీకటిలో
దాని జాడ కనబడదని కూడా తెలుసు ..
అందుకే .
వీడని వేదనల్ని వదులుకోవాలని
నిరాశల నిశీధి లో ..
నిస్తేజంగా ఉంటున్నా ..
ఎవరితో అవసరం లేని ఏకాకి గా ఉంటున్నా
కలలు మరిచిన కనులతో ..
ఈ లోకాన్ని చూస్తున్నా
మనసు విరిగిన వానిగా
మరణం కోసం ప్రయత్నిస్తున్నా
********************************************
written by ME
at 7:28am 9.12.2011



ఈ  కవిత సూర్య ఆదివారం సంచిక లో 22.1.2012 నాడు ప్రచురితమైనది..

No comments:

Post a Comment