Saturday 10 December 2011

ఎందుకని ..??????

కన్నీటి  ధారలు..
కాల్వలై  పొంగినా ...
కలతలు  తగ్గి
కాస్తయినా ...కుదుట పడదేం...???

నా  మనసు ...

ఆశ  చచ్చి ...

ఆవేదన  లోనే  మగ్గుతున్నా ...
అణువంతైనా   జాలి  కలిగి
ఆదరించరేం ...??
నా  అనే  వాళ్ళు ...

ఎవరికీ  నేనక్కర్లేదు ..

యే   కోశానా  నాపై  ప్రేమ  లేదు ...

నా  గెలుపే ,నా  బ్రతుకుని  నిర్ణయిస్తే ,,

ఆ  గెలుపుకై ...
నేను  చావడానికైనా  సిద్ధపడుతాను ....
నా  విజయమే  నాపై  ప్రేమ  కలిగిస్తే ...
ఆ  విజయానికి .. విధి  రాతనైనా  ధిక్కరిస్తాను ..

ప్రేమార  పలికే  మీ  చిన్ని  మాటలే ,

నాకు  ఊపిరినిస్తాయని ..
ఓదార్పు  గా  వెన్ను  తట్టే  మీ  చేతులే ,
నాకు  కొండంత  బలమిస్తాయని ...
అర్థం  చేసుకోరు  ఎందుకని ..???
అనురాగం  తో  నన్ను ,
అక్కున  చేర్చుకోరు  ఎందుకని ..??????

అంత  కాని  వాడినయ్యానా  మీకు ..

అంతా  అనామకుడిగా  చూసేందుకు ..
***********************************************
Written by ME
at 12:40am 10.12.2011

No comments:

Post a Comment