Tuesday 6 December 2011

"మనసారా" సినిమా లోని "నువ్విలా" అనే పాట

నువ్విలా ఒక్కసారిలా అరె ఏం చేసావే నన్నిలా
కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా
గుండె లోపల ఉండుండి ఏంటిలా
ఒక్కసారిగా ఇన్నిన్ని కవ్వింతలా..

నువ్విల ఒక్కసారిలా అరె ఏం చేసావే నన్నిలా
కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా

చూడాలి చూడాలి అంటూ
నీ తోడు కావాలి అంటూ
నా ప్రాణం అల్లాడుతోంది లోలోపల
ఇంతందం ఇన్నాళ్ళనుండి
దాక్కుంటూ ఏ మూల ఉంది
గుండెల్లోన గుచేస్తోంది సూటిగా
పేరే అడగాలనుంది
మాటే కలపాలనుంది
ఎంతో పొగడాలనుంది నిన్నే నిన్నే
కొంచెం గమ్మత్తుగుంది
కొంచెం కంగారుగుంది
అంత చిత్రంగ ఉందే
ఈ రోజు ఏమైందిలా ..

నువ్విలా .......

నువ్విలా ఒక్కసారిలా అరె ఏం చేసావే నన్నిలా
కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా

చంద్రున్నే మింగేసిందేమో
వెన్నెల్ని తాగిసిందేమో
ఎంతెంతో ముద్దోస్తున్నాది బొమ్మలా
తారల్ని వొళ్ళంతా పూసి
మబ్బులతో స్నానాలే చేసి
ముస్తాబై వచ్చేసిందేమో దేవత
మొత్తం భూగోళమంతా పూలే చల్లేసినట్టు
మేఘాలందేసినట్టు ఉందే ఉందే
నన్నే లాగేస్తునట్టు
నీ పై తోసేస్తునట్టు
ఏంటో దోరేలేస్తునట్టు
ఏదేదో అవుతుందిలా .........

నువ్విలా ....

నువ్విలా ఒక్కసారిలా అరె ఏం చేసావే నన్నిలా
కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా
గుండె లోపల గువ్వల గుంపులా
ఒక్కసారిగా ఇన్నిన్ని కేరింతలా ...

నువ్విలా ఒక్కసారిలా అరె ఏం చేసావే నన్నిలా
కోయిలా ఎందుకో ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా ..




చిత్రం : మనసారా (2010)
సంగీతం : శేఖర్ చంద్ర
రచన : భాస్కర భట్ల రవికుమార్

No comments:

Post a Comment