Wednesday 7 December 2011

ఎందుకు నాలో...

ఇది కలవరమా ..?
చెలి ప్రియ వరమా..?
ఎగిరి దుమికే ఆనందాల వేళ..
ఎందుకు నాలో ఈ అనుమానాల హేళ..

ఎదురు చుసిన క్షణం రానే వచ్చింది ..
యెద కోరిన మగువ ఎదుట నిల్చింది ..
అయినా ..ఇది ..
భ్రాంతి యో , భామ యో పోల్చలేకున్నా ..
భాధాకర ఆ విరహం నుండి తేరుకోలేకున్నా..
కన్నీళ్ళ ధారల్లో కరిగిపోతున్నా..
కాంతిమయ ఆ తేజస్సును విడువలేకున్నా ...
నాకు నేనే అర్థం కాని స్థితిలో ఉన్నా ..
నేటి నీ రాకే నిజమని నిర్ధారించుకున్నా..
ఇక ఎన్నడూ నను వీడకు అని వేడుకుంటున్నా..
నిను వీడి నేను బ్రతకలేను అని విన్నవిస్తున్నా ..
**********************************************
written  by  ME
At  12 :40 pm  8 .12 .2011

No comments:

Post a Comment