Tuesday 6 December 2011

నోట మాటలున్నా ..

నీ మాటల మర్మం తెలియనపుడు
నేనెంతో హాయిగా గడిపాను..
అప్పుడు నాకు తెలియదు ..
నీ మదిలోని వ్యధ రొద...
నీవు తెలపాలనుకున్న నీ బాధ..

నీవు లేని ఈ క్షణం ..నాకు తెలుస్తోంది ..
నోట మాటలున్నా..వినని మనసు లేనప్పుడు
పడే  ఆ బాధ ..చిత్ర వధ ..అంటే ఏంటో ..

ఇప్పుడు నువ్వేంటో నాకు అర్ధమయ్యింది
కాని నీ తోడే నాకు దూరమయ్యింది..
ఏడుపే ఆలంబన అయ్యింది ..
ఏకాకి జీవితమే స్వావలంబన అయ్యింది.

మన్నించే హృదయముంటే మరలి రావా నేస్తం.....
మరణించే క్షణం దాక నీ మనసై  ఉంటా..నా  జన్మ సమస్తం
 ********************************************

written by ME,
at 10:42am, 6.12.2011

No comments:

Post a Comment