Saturday 3 December 2011

మాకొద్దా.. ..

మా  నోటి  కాడి  కూడు గుంజేసుకున్నరు ,
మీ మోచేతి నీళ్ళు తాగమంటున్నరు 
బానిసత్వం మా ఖర్మ అయినట్లు ..
మీ ఆగడాల్ని భరించాల్నా...??
ఆధిపత్యం మీ హక్కు అయినట్లు ..
మమ్మల్ని మీరు పాలించాల్నా ..??
మాకొద్దా.. స్వయం పాలన..??
మాకు లేదా ఆత్మ గౌరవం ..??
జై తెలంగాణా ..!! జై జై తెలంగాణా ..!!

దొంగ దందాలతో మా భూములన్నీ దోచినారు 
పైరవీలతోనే మా కొలువులన్నీ లాగినారు ..
పూట పూట మీ కాల్లోత్తుకుంట ..
మీ బంటులుగా మేం బతకాల్నా..??
నోట్లో ఐదు వెళ్ళు పోక 
పస్తులతో మేం చావాల్నా..??
మాకొద్దా కూడూ గూడూ ..??
మాకు లేవా చదువూ...సత్తా ..??
జై తెలంగాణా ..!! జై జై తెలంగాణా ..!!
****************************
written by ME,
at 7am 9.6.2010
****************************
ఈ కవిత "వీర తెలంగాణా" మాస పత్రిక 
ఆగస్ట్ 2010  సంచిక  లో  ప్రచురితమైనది ..

No comments:

Post a Comment