Friday 2 December 2011

మీ ఊపిరులను వదలొద్దు..

వేదనల ముసుగు  తొలగక పోదు..
వేడుకల వెలుగు విరియక  పోదు..
అణిచి వేతలు  ఆధిపత్యాలు తొలిగిపోయి
స్వతంత్ర  తెలంగాణా అవతరించక పోదు
ఉద్యమానికి ఊపు తేవాలని 
మీ ఊపిరులను వదలొద్దు..    
కన్న పేగు బంధానికి 
కడ దాకా శోకం పెట్టవద్దు..
భావి తరానికి  మార్గ దర్శకులు మీరు
బ్రతుకు భారం అనుకోవద్దు..
నవ తెలంగాణా వారసులు   మీరు 
తెగించి నిలవడం  మరిచి పోవద్దు..
జై తెలంగాణా !! జై జై తెలంగాణా !! 
**************************************
written by ME,
 at 6am,  2.4.2011
**************************************
ఈ కవిత" వీర తెలంగాణా" మాస పత్రిక 
మే 2011   సంచికలో ప్రచురితమైనది..

No comments:

Post a Comment