Tuesday 29 November 2011

నేను ( Iam What Iam.....)

నా   గమ్యం  నాకు  తెలుసు ...
నా  స్వప్నం  నాకు  తెలుసు ...

తెగిన  గాలి  పటాన్ని  కాదు ..
దారి  తెలియని  బాటసారిని  కాదు ...

కాలం  ముళ్ళ  బాటలో  పయనిస్తున్నా ...
నా  ఆశయం  నేనెన్నడూ  వీడను ...

నీతి , నిజాయితీ  నా  ఆయుధాలు ...
సత్యం , సహనం  నా  కవచాలు ..

కాకులు  అరిచినా ..
కుక్కలు  మొరిగినా ...
నా  ఈ  పయనం  ఆగదు ..
పథం    మారదు  ..

ఇది  చీకటిని  చీల్చే  మిణుగురు  ఆరాటం ..
నా  జీవిత  పోరాటం ..

ప్రేమకి  బందీ  అయినా ...
ప్రేయసికి  దాసోహం  అనను ...
స్నేహానికి  విలువిచ్చినా ...
స్నేహితులే  లోకం  అనను ..

నా  ప్రతి  అడుగు  ప్రగతి  వైపే ...
నా  ప్రతి  కాంక్ష  రేపటి  వైపే ...
********************************
written by ME
at 7.10am, 1.11.2011..

No comments:

Post a Comment