Tuesday 29 November 2011

(అమ్మ మనసు )

ఈ  లోకం  నన్నేమన్నా ..
నువ్వే  నా  లోకం రా  కన్నా ...
నీకన్న  ఎవరూ  లేరు  మిన్నా ..

అత్మీయులమని  చెప్పేవారి  కన్నా ..
అనురాగంతో  వంచించిన  వారి  కన్నా ..
అమ్మ  అని  పిలిచే  నువ్వే  రా ,
నా  ప్రాణం  చిన్నా ...

కన్నా  వారు , నన్ను  
కుండీల   పాలు జేశారు  .
కట్టుకున్న  వాడు ,నన్ను 
రోడ్డున  పడవేసాడు ..
నే  కన్నా  నువ్వైనా ..
నన్ను  చేరదీయరా  అంటున్నా ..

అమ్మా  అనే  పిలుపుకు  దూరమయ్యాను ..
ఆప్యాయత  కి  కరువై  పెరిగాను ..
ఆనందం  నీ  పుట్టుకలోనే  చూసాను ..
అభద్రతతో  ఈ  విన్నపం  చేస్తున్నాను ..

నోట  ముద్ద  పడని  లేమి  నాది ..
ఓ  గూడు  లేని  బ్రతుకు  నాది ..
నా  రక్తమే  పాలుగా  చేసిస్తున్నా ..
నన్ను  క్షమించు రా  నాన్నా ..

నీకోసం నా ప్రాణమైనా ఇస్తాను .
దేహమైనా అమ్ముతాను ..
నిన్ను పెంచి పెద్ద చేస్తాను ..
నా ఊపిరిగా సాకుతాను ..
నువ్వైనా నా తోడుండరా చిన్నా  ..
ఈ పిచ్చి అమ్మని విడువకు  రా నాన్నా
**********************************
written by ME,
at 9:20am, 20.11.2011
********************************
Mother is an Undying Love.
A Love beyond compare.
The one you take your troubles to,
she is the one who really cares..
Mother..
You are all of this and more.
I Love you very much..

No comments:

Post a Comment