Tuesday 29 November 2011

అమ్మ తోడు ....

నన్ను  చూసి  ఈ  లోకం ,ఈసడిస్తోంది ..
అత్యాశ  పరుడివని ,గేలి  చేస్తోంది ..
నా  రూపు  చూసి  వెక్కిరిస్తోంది ..
నా  బాధ  చూసి  పరిహసిస్తోంది ..

అయినా ..
నాకు  తోడు  మా  అమ్మ  ఉంది ..
తన  ప్రేమ  నా  వెంట  ఉంది ..
నవ్విన  నాప  చేనే  పండుతుంది ...
నా  శ్రమ  తప్పక  ఫలిస్తుంది ...

మా  అమ్మ  ..నా  కోసం 
మోడుగా మారి   నన్ను  పెంచింది ..
ఆల్చిప్ప  వలె    కాపాడింది ..
ప్రతి  కష్టాన్ని  ఇష్టంగా  చూసింది ..
ప్రతి  వ్యధని  బాధ్యతగా  మోసింది ...

ఎవరు  చిన్న  చూపు  చూసినా ..
నేనే  తన  లోకం  అంది ..
ఎవరు  అడ్డు  నిలిచినా.... 
నా  ప్రగతే  తన  కాంక్ష  అంది ..

ఈ  సృష్టిలోని  ప్రతి  అణువు , 
నాకు  ప్రేరణ  నిచ్చింది ..
మా  అమ్మలోని  ప్రతి  శ్వాశ , 
నాకు  ఆయువు పోసింది  ...
బ్రతుకు పై ఆశ ను  రేపింది   ... 

అందుకే ...
బాష్పాంజలి  గా ..
నే  కార్చే  ప్రతి  కన్నీటి  చుక్క ,
ఒక  అక్షర  నీరాజనమై ,
మీ    ముందు  నిలిచింది ..
కవితై ,కమ్మని  పాటై 
నా  గుండె  నుండి  జాలువారి ,
తన  పాద  పద్మాలలో ,పునీతమైంది ..
******
I LOVE MY MOM..
********************************
written by ME
at 10am ,21.11.2011
********************************
I Love U mom,
having u makes me feel safe & calm..
I miss U mom,
missing touches to my face with your chapped palm.

No comments:

Post a Comment