ఎందుకో ఈరోజు ,
మనసు చివుక్కుమంది ..
గుండెల్లో కలుక్కుమంది ..
కరకు ముల్లుతో కోసినట్లు ..
ఇనుప పిడికిలిలో నలిపినట్లు ..
నడకలో తడబాటు ..
ఆలోచనలో ఎడబాటు ..
ఎవరో నన్ను వెన్నక్కి నెట్టుతున్నట్లు ..
పాతాళం లో పడవేస్తున్నట్లు ..
జన సంద్రం లో జాడ తెలియక ,
నిను చేరే దిక్కు ఎరుగక ,
కన్నీటి అలలు నిండా ముంచేస్తుంటే ..
కసాయి హృదయం నను నమిలేస్తుంటే ...
చస్తూ బ్రతుకుతూ ...
నీ చిరునామా వెతుకుతూ ...,
అంతులేని ఆకాశానికి ,
అంచుని కనుగొనే ప్రయత్నం చేస్తోంది ..
ఆశ చావని నా విరహానికి
విముక్తి నిచ్చే యోచన చేస్తోంది ..
పిచ్చి మనసు ...
లోలోపల దాగి ఉన్నా ..
లోభితనం లేదు తనకు ..
ప్రేమ ఎంత పంచుతున్నా ..
కరువు అన్నది రాదు తనకు ..
గాయలెన్ని చేసినా ,
జ్ఞాపకముండదు తనకు ..
గుప్పెడు ప్రేమలకే ,
గుర్తింపు నిచ్చే నీకు ..
**************************
******
written by ME,
at 10:15pm, 16.11.2011.
మనసు చివుక్కుమంది ..
గుండెల్లో కలుక్కుమంది ..
కరకు ముల్లుతో కోసినట్లు ..
ఇనుప పిడికిలిలో నలిపినట్లు ..
నడకలో తడబాటు ..
ఆలోచనలో ఎడబాటు ..
ఎవరో నన్ను వెన్నక్కి నెట్టుతున్నట్లు ..
పాతాళం లో పడవేస్తున్నట్లు ..
జన సంద్రం లో జాడ తెలియక ,
నిను చేరే దిక్కు ఎరుగక ,
కన్నీటి అలలు నిండా ముంచేస్తుంటే ..
కసాయి హృదయం నను నమిలేస్తుంటే ...
చస్తూ బ్రతుకుతూ ...
నీ చిరునామా వెతుకుతూ ...,
అంతులేని ఆకాశానికి ,
అంచుని కనుగొనే ప్రయత్నం చేస్తోంది ..
ఆశ చావని నా విరహానికి
విముక్తి నిచ్చే యోచన చేస్తోంది ..
పిచ్చి మనసు ...
లోలోపల దాగి ఉన్నా ..
లోభితనం లేదు తనకు ..
ప్రేమ ఎంత పంచుతున్నా ..
కరువు అన్నది రాదు తనకు ..
గాయలెన్ని చేసినా ,
జ్ఞాపకముండదు తనకు ..
గుప్పెడు ప్రేమలకే ,
గుర్తింపు నిచ్చే నీకు ..
**************************
******
written by ME,
at 10:15pm, 16.11.2011.
No comments:
Post a Comment