అమ్మా ...
ఆ దేవుడు యే ధ్యాసన ,
నిను సృష్టించాడో గాని ,
ఆ దేవున్నే మించినావమ్మా ....
ఆ బ్రహ్మయ్య యే ముహూర్తాన ,
నను కరునించాడో గాని ,
నీ కడుపున జన్మించినానమ్మా ..
కాలే కడుపుల జీవితంలో ,
ఉపవాసాలే ఎక్కువ ,
నీళ్ళు ,కన్నీళ్ళతో గడిపే రోజులే ఎక్కువ ..
కాని నేనున్నానని ,
నీ కడుపులో పిండంగా ఎదుగుతున్నానని ,
నా ఆకలైనా తీర్చాలని ,
ఓ ముద్దైనా పెట్టాలని ,
కణ కణ మండే ఎండల్లో పనికెల్లావే ,
నిప్పుల కొలిమిల్లో కూలి చేసావే ,
పైన నువ్ మాడిపోతున్నా ,
లోన ఉన్న నాకు రక్ష చుట్టావే ,
అమ్మా ...
ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోనూ ...
నీకేం చేసి , ఈ జన్మ సార్థకం చేసుకోనూ ..
నీ ఉరుకులు ,పరుగులు నన్ను మింగేస్తాయని ,
నీ పస్తులు ,బాధలు నాకు హాని చేస్తాయని ,
నువ్వు పడ్డ తపన ,వేదన
నాకు తెలుసమ్మా ..
నీ నరకం చూసి ,
లోన నేను కన్నీరు కార్చానమ్మా ...
అభిమన్యుడి అంతటోడిని కాకపోయినా ...
నీ అణువణువుని పంచుకొని పెరిగినవాన్ని ,
నాకు తెలుసమ్మా ...
ఈ నవమాసాల భారం ,
కుంగి పోయిన నీ శరీరం ..
నొప్పులతో నువ్వు ఏడుస్తుంటే ,
లోన నేను నవ్వుతున్నానమ్మా ..
ఈ ప్రపంచాన్ని చూస్తానని కాదు ..
నా అమ్మ రూపాన్ని కనులార చూస్తానని ..
పుట్టిన నన్ను చూసి , నువ్ నవ్వుతుంటే ,
నీ కష్టం తెలిసిన నేను ఎడుస్తున్నానమ్మా ..
ఈ వెలుగుని తట్టుకోలేక కాదు ..
నీ త్యాగాన్ని మరువలేక ,
నా కన్నీళ్ళతో నీ కాళ్ళు కడుగాలని ,
కడుపార ఎడుస్తున్నానమ్మా ..
నను కన్నా మా యమ్మా ..
అమ్మా .. ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోనూ ..
నీకేం చేసి ఈ జన్మ సార్ధకం చేసుకోనూ ...
ఎన్ని జన్మల సేవ చేసినా తీరదు నీ ఋణం ..
అమ్మ ని మరిచిపోతే , అంతకన్నా లేదు దారుణం ..
**********************************
written by ME
at 1:22am, 18.11.2011
completed at mrng 8am
**********************************
Mother is the biggest god,
to all human being..
Believe it or not,
she is the real queen,
she protect her child and not mean.
ఆ దేవుడు యే ధ్యాసన ,
నిను సృష్టించాడో గాని ,
ఆ దేవున్నే మించినావమ్మా ....
ఆ బ్రహ్మయ్య యే ముహూర్తాన ,
నను కరునించాడో గాని ,
నీ కడుపున జన్మించినానమ్మా ..
కాలే కడుపుల జీవితంలో ,
ఉపవాసాలే ఎక్కువ ,
నీళ్ళు ,కన్నీళ్ళతో గడిపే రోజులే ఎక్కువ ..
కాని నేనున్నానని ,
నీ కడుపులో పిండంగా ఎదుగుతున్నానని ,
నా ఆకలైనా తీర్చాలని ,
ఓ ముద్దైనా పెట్టాలని ,
కణ కణ మండే ఎండల్లో పనికెల్లావే ,
నిప్పుల కొలిమిల్లో కూలి చేసావే ,
పైన నువ్ మాడిపోతున్నా ,
లోన ఉన్న నాకు రక్ష చుట్టావే ,
అమ్మా ...
ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోనూ ...
నీకేం చేసి , ఈ జన్మ సార్థకం చేసుకోనూ ..
నీ ఉరుకులు ,పరుగులు నన్ను మింగేస్తాయని ,
నీ పస్తులు ,బాధలు నాకు హాని చేస్తాయని ,
నువ్వు పడ్డ తపన ,వేదన
నాకు తెలుసమ్మా ..
నీ నరకం చూసి ,
లోన నేను కన్నీరు కార్చానమ్మా ...
అభిమన్యుడి అంతటోడిని కాకపోయినా ...
నీ అణువణువుని పంచుకొని పెరిగినవాన్ని ,
నాకు తెలుసమ్మా ...
ఈ నవమాసాల భారం ,
కుంగి పోయిన నీ శరీరం ..
నొప్పులతో నువ్వు ఏడుస్తుంటే ,
లోన నేను నవ్వుతున్నానమ్మా ..
ఈ ప్రపంచాన్ని చూస్తానని కాదు ..
నా అమ్మ రూపాన్ని కనులార చూస్తానని ..
పుట్టిన నన్ను చూసి , నువ్ నవ్వుతుంటే ,
నీ కష్టం తెలిసిన నేను ఎడుస్తున్నానమ్మా ..
ఈ వెలుగుని తట్టుకోలేక కాదు ..
నీ త్యాగాన్ని మరువలేక ,
నా కన్నీళ్ళతో నీ కాళ్ళు కడుగాలని ,
కడుపార ఎడుస్తున్నానమ్మా ..
నను కన్నా మా యమ్మా ..
అమ్మా .. ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోనూ ..
నీకేం చేసి ఈ జన్మ సార్ధకం చేసుకోనూ ...
ఎన్ని జన్మల సేవ చేసినా తీరదు నీ ఋణం ..
అమ్మ ని మరిచిపోతే , అంతకన్నా లేదు దారుణం ..
**********************************
written by ME
at 1:22am, 18.11.2011
completed at mrng 8am
**********************************
Mother is the biggest god,
to all human being..
Believe it or not,
she is the real queen,
she protect her child and not mean.
No comments:
Post a Comment