Tuesday 29 November 2011

అమ్మ ప్రేమ ...

నిన్ను  చూడాలని  పరుగు  పరుగున వచ్చా ..
నీ  నగుమోము  చూసి    నిశ్చేష్ట గా   నిలిచా ..
నడి  రోడ్డులో  ఉన్నానని  ఆ  క్షణం  మరిచా ..
నీ  దరికి  రావాలని  ఓ  అడుగేసి  నడిచా ...


పొంచి  ఉన్న  యమపాశం  నా  పైకి  వచ్చింది ..
కాల  కూట విషాన్ని క్రూరంగా చిమ్మింది ..
ఏమైందో  తెలియక  నిండా  మైకం  కమ్మింది ...
దీర్గ  నిద్ర  నన్ను  ఆవరించింది ...


జ్ఞాపకాలేవో  తడిమినట్టు ,
అనుబందాలేవో  లేపుతున్నట్టు .
అప్పుడప్పుడు  చిన్న  కలవరింతలు ....
కాని  ఎల్లప్పుడు  నన్ను నేనే మరిచిపోయేంత  నిద్ర ..


ఏమైంది  నాకు .. ఏం  జరుగుతోంది  నాకు ..??
నేను  చచ్చానా ,బ్రతికానా ..??


అయోమయం ..అంతా  గందర గోళం ...??


అవునూ  నా  కొడుకు ...
నా  కొడుకెక్కడ ..???
నా  బంగారు  తండ్రి  ఎక్కడ ??? ఎక్కడ ..?
నాకీ  లోకంలో  ఏమైనా  ఉంటె ..అది  వాడొక్కడే ..
వాడికీ  అంతే ...


 మరి ఇప్పుడు నేను వాణ్ని విడిచి వెళితే ...????




ఒక్కసారిగా  గుండెలో  అలజడి  మొదలయ్యింది ..
కళ్ళలో  నీళ్ళు  ఉబికి  వస్తున్నాయి ...
శ్వాశ  తడబాటు  పడుతోంది ...
నాలో  జీవం  మల్లి  మొదలయ్యింది ..


నా  కొడుకుని  చూడాలన్నా  ఆరాటం  వెల్లువెత్తింది ..


కళ్ళు  తెరిచాను ....

అంతటా  విస్మయం ..ఆశ్చర్యం ..
కాని  నా  కొడుకు మోములో  నేనొచ్చానన్న  ఆనందం ..


అమ్మా  అని  భోరున  విలపిస్తూ ..నా  గుండెకి  హత్తుకున్నాడు ..


నేనెక్కడికి  వెళ్తాను  రా  నిన్నొదిలి ..
అని  నాలోని  అమ్మ  హృదయం  గోముగా  తన   తల   నిమిరింది..


************************************
written by ME,
at 3:57pm, 24.11.2011
11:45pm completed
*************************************
A mothers love for Her child,is like nothing else in the world. It knows No Law, No Pity, it dares all things and crashes down remorselessly all that stands in its path..


There is only one Pretty child in the world, and every mother has it.
*******



No comments:

Post a Comment