Tuesday 29 November 2011

జోహార్ అమ్మా ..నీకు జోహార్ ...

అంతా కొత్తగా ఉంది ..
కాసింత వింతగానూ ఉంది ..
ఇదెలా సాధ్యమో ..
నా చిన్ని బుర్రకి తెలియకపోయినా ..
భలే గమ్మత్తుగా ఉంది ..

నను ఆడించేది .. నాతో ఆటలాడేది ..
నాకు ముద్ద పెట్టేది ..
నను ముద్దు చేసేది ..
అంతా ఒక్కరే అని తెలిసాక ..
ఆ ఒక్కరి లోని ప్రాణం కూడా ,
నాదే అని తెలిసాక ..
అది బొమ్మ కాదు ..
మా అమ్మ అని తెలిసాక ..
నాకు ప్రాణం పోసిన ,
నిజ బ్రహ్మ అని తెలిసాక ...

అంతా కొత్తగా ఉంది ..
కాసింత వింత గానూ ఉంది ..

నాకోసం తను పసిపాప అయింది ...
కథలు చెప్పే పెద్దమ్మ అయింది ..
జోల పాటల కోయిలమ్మ అయింది ..
జ్ఞానమిచ్చే గురువుగాను మారింది ..

ఆ నేలవంకనే నేల దించి ,
నా నవ్వులకి తాను మురిసింది ..
తన రక్తాన్నే పాలుగా మార్చి ..
నా ఆకలికి తాను చితికింది ..

తన దేహంలోనే ,నను కాపు కాచి ..
సృష్టికే ప్రతి సృష్టి చేసింది ..
అవనిలోన అసలు అధ్బుతమై ,
ప్రేమకే ప్రేమ పాటాలు  చెప్పింది ..

ఇదంతా ఎలా సాధ్యమో ,
నా చిన్ని బుర్రకి తెలియకపోయినా ...
నీకే పాదాభివందనం చేస్తున్నానమ్మా ..
ఆజన్మాంతం నే కొలిచే దేవత ..
నీవే అంటున్నానమ్మ ..

జోహార్ అమ్మా  ..నీకు జోహార్ ... 
************************************
written by ME,
at 1:36am 23.11.2011.
Completed 7:30am
*************************************
MOTHER is an ANGEL.
M- Made
O- Of
T- True
H- Heart
E- Everyday
R- Rises 4U.

No comments:

Post a Comment