Tuesday 29 November 2011

ఈ క్షణం నీతో మాట్లాడాలని ఉంది ..


ఈ  క్షణం  నీతో  మాట్లాడాలని  ఉంది ..
నీ  కౌగిలిలో , కరగాలని   ఉంది ..
గుండె  బరువు  దించాలని  ఉంది ..
గొంతు విప్పి  పలకాలని  ఉంది ..

దూరం  చేసిన  గాయాన్ని ,
చూపాలని  ఉంది ...
కాలం  వేసిన  శిక్షను
తప్పించాలని  ఉంది ..
నీ  ప్రేమ  చేసే  మాయలో
మళ్లీ  మునగాలని  ఉంది ..
ఆ  పులకింతతో  నా  వేదనంతా
మరవాలని  ఉంది ..

ప్రియా . ..
మనసారా  నిన్ను ,
హత్తుకోవాలని  ఉంది ..
ముడి  వీడని  బంధమై ,
మరణం  అంచు దాకా ,
నడవాలని  ఉంది ...

ఇవన్నీ  నీకు  చెప్పాలని  ఉంది ..
నీ  జతలో  సేద  తీరాలని  ఉంది ..
**********************
written by BODDU MAHENDER
At 9.42pm, 4.11.2011.
************************
Please come and sit beside me,
I have somuch to say,
the words i have to share with u..
I need to speak today..

No comments:

Post a Comment