Tuesday 29 November 2011

ఎందుకే చెలీ ...

పసిపాప లా చూసుకుంటానని 
ప్రమాణం చేసాను ...
పాదం కందకుండా మోస్తానని
పట్టుదల చూపాను..
నువ్వే నా సర్వస్వంగా బ్రతికాను..
నీకే నా సర్వస్వం అర్పించాను..
నీవెక్కడున్న నా ఎదలో 
పదిలంగా ఉన్నావని సంతసించాను ..
నీ ధ్యాస కూడా నన్ను 
ఊరడిస్తున్నందుకు పొంగిపోయాను..
నిన్ను నా దానిగా చేసుకోవాలని 
కలలు కన్నాను...
నువ్వే నా దానివని లోకమంతా
చెప్పుకున్నాను..
ఇప్పుడు నువ్వేమో...
ఏ మాట చెప్పకుండా ఎటో వెళ్లిపోయావు..
నా బాటన నన్ను వదిలి వీడి పోయావు..
ముక్కలైన నా గుండె 
వెక్కి వెక్కి రోదిస్తోంది ... 
నా నీడ నన్ను మోసం చేస్తుందా..?
అని పదే పదే వేధిస్తోంది...
కాని నాకు తెలుసు....చెలీ 
నీ ఆలోచన ,ఆవేదన ..
నువ్వు పడుతున్న నరక యాతన ,
నేనేమి కాని వాడిని కాదు కదా..
ఆ మాత్రం నిను అర్థం చేసుకోలేనా..?
ఎందుకే చెలీ ...
నను ఈ ఎడబాటు పంజరంలో
బందీగా చేసి వెళ్లావు..
శిక్ష నాకు వేసి 
బాధ నువ్వు అనుభవిస్తున్నావు ..?
**************************
written by BODDU MAHENDER
At 10:26pm, 29.11.2011

No comments:

Post a Comment