Tuesday, 29 November 2011

అమ్మా ...

అమ్మా ...
అందరూ  నన్ను  హేళన  చేస్తున్నారు ..
అంటరాని  వాడిగా  దూరం  చేస్తున్నారు  ..
అదృష్టవంతుడివి  కాదు  అంటున్నారు ..
అక్కరకు  రాని  బ్రతుకు  అంటున్నారు ..

నేను ..
అపజయాల  మేళం  నట ..
ఆవేదనల  రూపం  నట ...
అడ్డు  వస్తే , అపశకునమాట ..
వాళ్ళతో  ఉంటె  అవమానమాట ..,

అమ్మా ...
స్నేహంగా   మెలగడం  పాపమైంది ..
ప్రేమగా  ఉండడం , శాపమైంది .
కలతల  నిద్ర  ఇపుడు  తోడయ్యింది ..
కల్మషంలేని  నవ్వు  కరువయ్యింది ..
ఒంటరితనం  చేరువయ్యింది ..
లోన  గుండెకు  గాయమయ్యింది ..

ఇపుడు  నేను ....,
నాకై  నేను  బ్రతుకుతున్న  ఏకాకిని ..
నీ  ప్రేమే  అండగా  చేసుకున్న  పసివాడిని . 
రేపటి  వైపుగా  నడుస్తున్న  కాంతి  రేఖ  ని .
విజయ  గర్వంకై  చూస్తున్న  పొలికేక  ని .

అమ్మా ...
నీవే  లేకుంటే  నేనెప్పుడో  పోయేవాన్ని ,
నీ  మాటే  లేకుంటే , నిలువునా  కూలేవాన్ని ..
నీ  ఆలనే  నాలో  కొత్త  ఉత్తేజం  నింపింది ..
నీ  లాలనే  నాకు  కొత్త  ఉత్సాహం  ఇచ్చింది ...

అమ్మా ...
నిన్ను  మించిన  స్నేహం  లేదు ..
నీ  ప్రేమని  మించిన  అమృతం  లేదు ..
నీవు  లేకుంటే  నాకు  ఈనాడే  లేదు ..
నిన్ను  మరిస్తే  నాకు  ఆ  క్షణమే  లేదు ...
*********************************
based on real incidents..
Written by ME,
At 2:35am, 17.11.2011.
*********************************
Mom's smile can brighten any moment.
Mom's Hugs put joy in all our days. 
Mom's love will stay with us forever, 
And touch our lives in precious ways. 
The values you've taught, 
The care you've given, 
And the wonderful love You've shown, 
Have enriched my life, 
In more ways than I can count, 
I Love You Mom..

No comments:

Post a Comment