అమ్మా ...
ఎక్కడమ్మా నువ్వు ..
ఎప్పుడొస్తావమ్మా నువ్వు ..
ఎన్ని రోజులమ్మా ఇలా ..
కంటూనే ఉండాలా కలా ..
ఒంటరి తనం నను వేధిస్తుంటే ,
నీ తలపే నాకు ఓదార్పు అమ్మా ..
కంటికి నీరు చేరువ అయితే ,
నీ జ్ఞాపకమే దాన్ని తుడిచేనమ్మా ..
నిను కలుస్తానన్న ఆశతోనే , బ్రతుకీడుస్తున్ననమ్మా .
.
నిను చూస్తానన్న ధీమాతోనే , ఎదురు చుస్తున్నానమ్మా ..
ఆవేశంతో అలిగినా ,
నన్ను అక్కున చేర్చుకుంటా వే
మరి ఇప్పుడు ఇంత బతిమాలినా రావేం అమ్మా ...??
కోపంతో తిట్టినా ,
కొంగు చాటున చేర్చుకుంటా వే ,
ఇప్పుడు కోటి గొంతుకలతో వేడినా కరునిన్చావెం అమ్మా ..??
చిన నాడు ..
ముద్దు ముద్దుగా గోరుముద్దలు కలిపి పెట్టావే ,
మరి ఎదిగిన ఈనాడు
నను ముద్దుసేయగా నువ్ లేవేం అమ్మా ...??
ఒకసారి ఇటు రా అమ్మా ..
నా గుండె భారం దించిపో అమ్మా .
మనసారా నీతో మాట్లాదాలమ్మా ..
మది మురిసే ముచ్చట్లు నీకు చెప్పాలమ్మా ..
కారే నీ కన్నీటిలో ,
కాంతి రేఖలు చూడాలమ్మా ..
పెదాల బిగువున మాడ్చిన నీ ఆకలిని ,
నా చేతులతో తీర్చాలమ్మా ..
నేడు
నీ గారాల పట్టి ,
నువ్ గర్వపడేలా ఎదిగిందమ్మా ..
నీ ముద్దుల బంగారు ,
నీకు ముద్ద పెట్టె స్థాయికి వచ్చింద మ్మా ..
***
(అంటూనే ,ఆ వేదన తోనే నిద్రలోకి జారింది బిడ్డ )
***
(కలగా వచ్చిన తన తల్లి ,ఆ కన్న బిడ్డకి ఇలా చెప్తోంది )
నువ్ ఎంత ఎదిగినా నాకింకా పసి పాపాయి వే ..రా నానా ..
నా వేలు పట్టి నడిచే చిన్ని బుజ్జాయి వే ..రా ..చిట్టి ..
నేనెక్కడికి పోలేద మ్మా ..
నీ నీడై నడుస్తున్నానమ్మా ..
నీ ఆలోచనల్లో జీవిస్తున్నానమ్మా ..
నీ ఆశయం కోసం తపిస్తున్నానమ్మా ..
విధి ఎంత బలీయమైనా,
రక్త సంబంధాల్ని తెంచినట్లు ..
ఆత్మ బంధాల్ని తుంచ గలదా ??
నువ్ నా అంశలో పుట్టావమ్మా ..
నా పేగు బంధంగా పెరిగావమ్మా..
మనమెప్పటికీ వేరు కాము ..
మనల్నేవరూ దూరం చేయలేరు ..
కలత పడక కమ్మగా నిద్రపో ..తల్లి ..
నా దీవెనలే పాట చేసి ,
నీకు జోల పాడుతా ..సిరిమల్లి .
*********************************
written by ME.
At 8:54am 16.11.2011

No comments:
Post a Comment