కొత్త కొత్త ఆశలు
కొత్త కొత్త ఊహలు
కొత్త వసంతం కొలువులో
కొత్తగా చెలరేగే కోర్కెలు
కొత్త స్నేహాలు వికసించాలని
కొత్త బంధాలు విరజిల్లాలని
కొత్త అనుభూతుల మరపుల్లో
కొత్త లోకాలని ఆవిష్కరించాలని
కొత్తగా కోరే హృదయం లో
కొత్తగా వచ్చే ఉదయం లో
కొత్త పాటల కోయిల పాడే
కొత్త సంవత్సర స్వాగత గీతిక
కొత్త భావనల ఈ" మహేంద్రుడు" పలికే
కొత్త తపనల ఈ కవితా వీచిక..
********************************
written by ME
at 9pm 25.12.2010
*********************************
ఇది జనవరి 2 , 2011 సూర్య పేపర్ ఆదివారం సంచిక లో ప్రచురించబడింది
No comments:
Post a Comment