ఆపవా ఇకనైనా ..
మానవా కాస్తయినా...
ఇంతలా తిండి తింటే
నేను పెట్టగలనా... హొ ..
చాలులే నీ తిట్లు
పెట్టవే బొబ్బట్లు ..
ఎంతగా ట్రై చేసినా
మానలేనే ... చెలియా ..
పెరిగిన బొజ్జని చూసి
తగ్గించవా కాస్తయినా ..
నా నోటికి తాళం వేయడం
కుదిరేనా ...హొ ..
ఓ హాయిగా ..ఇష్టంగా
తిన్నదీ చాలింకా
బాడీ షేపు , హెల్త్ తీరు
చూసుకో పదిలంగా ...
కుదురుగా ఓ ముద్ద
ఒంటబట్టనీయవుగా..
డైటు రూల్స్ చెప్పి చెప్పి
విసిగిస్తావేం.. భామ ...
########################
బొడ్డు మహేందర్ mahender.b
చెన్నూర్ , ఆదిలాబాద్ జిల్లా ..
ఫోన్ : 9963427242
#################
ఇది సూర్య దిన పత్రిక ఆదివారం సంచికలో తేది : november 20,2010
నాడు ప్రచురితమైనది
No comments:
Post a Comment