Thursday, 18 April 2013

జయహో.. ఓ బాబా సాహెబ్ అంబేద్కర్..

అణగారిన వారి కోసం,
అణిచివేయబడిన వారి కోసం,
ఆధిపత్య వర్గాలు సృష్టించిన 
అసమానతల నిర్మూలన కోసం 
అస్పృశ్యతని సహించి,
అవమానాల్ని భరించి,
సమాజాన్ని సంస్కరించి,
సంప్రదాయాలని ప్రక్షాళించి,
జాతి జనులను జాగృతం చేసిన మరాఠా యోధ,
రాజ్యాంగంతో పరిష్కారం చూపిన మహర్ మేధ..
జయహో.. ఓ బాబా సాహెబ్ అంబేద్కర్..
జయజయహో... మా దీన బంధువు అంబేద్కర్..
*******************************
written by BODDU MAHENDER
at 2:10pm 18.4.2013

No comments:

Post a Comment