ఎవరు నేను..?
ఈ ప్రశ్న కి జవాబునిచ్చేది..
ఆత్మ జ్ఞానమా..?ఆత్మీయ తనమా..?
ఏమిటి నేను..?
ఈ ప్రశ్నకి జవాబుగా నిలిచేది...
అధికార గణమా..?అంతులేని ధనమా..?
దేనికై నేను..?
ఈ ప్రశ్నకి జవాబు అనుకునేది...
స్వార్ధం అనా? సమాజ హితం అనా ..?
ఇలాంటి అంతులేని ప్రశ్నల మధ్య
ఆగని నా తపనల మధ్య
వెతుకుతున్నా నన్ను నేనే...
వేసారిపోతున్నా నీకై నేనే..
******************************
written by BODDU MAHENDER
at 9:17pm 12.1.2013
No comments:
Post a Comment