Tuesday, 11 December 2012

నవ్వుతూ వెళ్ళిపో ...నువ్వుగా మిగిలిపో ... స్రవంతి (1986)


పల్లవి :
నవ్వుతూ వెళ్ళిపో ...నువ్వుగా మిగిలిపో ...
పువ్వులా రాలిపో.. తావిలా మిగిలిపో...
వేసవిలో మల్లెలా..వేదనలో మనిషిగా
కలకాలం గగనంలో తారలా ఆరనీ దివ్వెలా
నవ్వుతూ వెళ్ళిపో ...నువ్వుగా మిగిలిపో
పువ్వులా రాలిపో.. తావిలా మిగిలిపో...

చరణం : 1

మురిపించే చిరునవ్వే పసిపాపలలో అందమూ
పకపకలాడే పాపల నవ్వే బాపూజీకి రూపమూ..
పగనైన ప్రేమించు ఆ నవ్వులు
శిలనైన కరిగించు ఆ నవ్వులు
వేకువలో కాంతిలా... వేదనలో శాంతిలా...
చిరకాలం నవ్వాలి స్వాతిలా.. ఆరని జ్యోతిలా..
నవ్వుతూ వెళ్ళిపో ...నువ్వుగా మిగిలిపో ...
పువ్వులా రాలిపో.. తావిలా మిగిలిపో...

చరణం : 2

ఉదయించే తూరుపులో కిరణాలన్నీ నవ్వులే..
వరములు కోరే దేవుడికిచ్చే హారతి కూడా నవ్వులే..
మృతినైనా గెలిచేటి ఈ నవ్వులు నీ పేర మిగిలేటి నీ గురుతులు..
నవ్వులతో సంతకం చేసిన నా జీవితం
అంకితమే చేస్తున్నా...కవితలా..తీరని మమతలా.

నవ్వుతూ వెళ్ళిపో ...నువ్వుగా మిగిలిపో ...

పువ్వులా రాలిపో.. తావిలా మిగిలిపో...
వేసవిలో మల్లెలా..వేదనలో మనిషిగా
కలకాలం గగనంలో తారలా ఆరనీ దివ్వెలా


చిత్రం : స్రవంతి (1986)

సంగీతం : చక్రవర్తి
రచన : వేటూరి
గానం : ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం
***************************
Movie Name : Sravanthi (1986)
Music Director : Chakravarthy
Lyricist : Veturi Sundara Ramamurthy
Singer : S.P.Bala Subramanyam

for more songs n lyrics :

visit : http://telugucinemasongs-lyrics.blogspot.in/

ఈ పాటకి తగిన ఫోటోలతో నేను ఎడిట్ చేసి రూపొందించిన వీడియో..
***********************************
created by BODDU MAHENDER
at 2:20m 12.12.2012

No comments:

Post a Comment