ఆలోచన అజ్ఞానం వీడింది..
మనసు మైథునం వీడింది..
బంధం బాధ్యతని తెలిపింది..
స్నేహం ఆత్మీయతని మరిచింది..
ఈ వాస్తవికత నాలో వైరాగ్యం తెచ్చింది.
శాస్త్రీయత నాకు స్వార్ధ గుణం ఇచ్చింది..
ఆనందం నానుండి అంతులేని దూరాని కెళ్లింది..
అభివృద్ధి నాకు అసంతృప్తినే మిగిల్చింది..
అప్పుడే ఓ నిశ్చయానికి వచ్చా..
నిజంలా బ్రతకడంలోని బాధని భరించేకన్నా..
అబద్ధంలోని హాయిని అనుభవించాలని..
ప్రేమ గుడ్డిదని వేళాకోళం చేసే కన్నా..
మనసు మంచిది అని సరిపెట్టుకోవాలని..
***************************
written by ME
at 4:25pm 4.9.2012
No comments:
Post a Comment